రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ

  • రేపు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ
  • కవిత తరఫున వాదనలు వినిపించనున్న ముకుల్ రోహత్గీ
  • ఢిల్లీకి బయలుదేరిన కేటీఆర్, హరీశ్ రావు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. రేపు కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు ఢిల్లీ వెళుతున్నారు.

జైల్లో ఉన్న కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఈ నెల 22న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భర్త అనిల్ సమక్షంలో పరీక్షలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు జైలుకు తరలించారు. అంతకుముందు, జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స అందించారు.


More Telugu News