మూడో పెళ్లిపై ఆమిర్ ఖాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  • న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి నిర్వ‌హిస్తున్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమిర్‌
  • వైవాహిక బంధం, మూడో పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
  • మాజీ భార్య‌లు రీనా ద‌త్తా, కిర‌ణ్‌రావుతో మంచి అనుబంధ‌మే ఉంద‌ని వ్యాఖ్య‌
  • 59 ఏళ్ల వ‌య‌సులో మూడో పెళ్లి క‌ష్టమ‌న్న బాలీవుడ్ మిస్టర్ ప‌ర్ఫెక్ట్
బాలీవుడ్ మిస్టర్ ప‌ర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తాజాగా న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి నిర్వ‌హిస్తున్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైవాహిక బంధం, మూడో పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ త‌న మాజీ భార్య‌లు రీనా ద‌త్తా, కిర‌ణ్‌రావుతో మంచి అనుబంధ‌మే ఉందని వెల్ల‌డించారు. వారు ఇప్ప‌టికీ త‌న కుటుంబంలో భాగ‌మేన‌ని తెలిపారు. 

అలాగే వివాహ జీవితంలో రెండు సార్లు ఫెయిల్ అయిన త‌న నుంచి వైవాహిక సూచ‌న‌లు తీసుకోక‌పోవ‌డం మంచిద‌న్నారు. త‌న‌కు ఒంట‌రిగా జీవించ‌డం ఇష్ట‌ముండ‌ద‌ని చెప్పిన ఆమిర్‌.. త‌న‌కు ఒక భాగ‌స్వామి ఉండాల‌ని కోరుకుంటాన‌ని చెప్పారు. ఇక జీవితంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. క‌నుక వివాహ బంధం స‌క్సెస్ అవుతుందా లేదా అని చెప్ప‌లేమ‌ని అన్నారు. 

ఈ క్ర‌మంలో మూడో పెళ్లి ఆలోచ‌న ఉందా అని రియా అడిగారు. దీనికి స‌మాధానంగా.. '59 ఏళ్ల వ‌య‌సులో వివాహం అంటే క‌ష్టం. నాకు ఎన్నో బాధ్య‌త‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం నాకెంతో ఇష్ట‌మైన వారితో సంతోషంగా స‌మయాన్ని ఆస్వాదిస్తున్నా. నా ఫ్యామిలీ, పిల్ల‌లు, మిత్రుల‌తో రీ క‌నెక్ట్ అయ్యా' అని ఆమిర్ ఖాన్‌ చెప్పుకొచ్చారు.  
  
ఇదిలాఉంటే.. ఆమిర్ ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. 1986లో మొద‌ట రీనాద‌త్తాను ల‌వ్‌మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంట 2002లో వీడిపోయింది. ఆ త‌ర్వాత ల‌గాన్ మూవీకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కిర‌ణ్‌రావుతో ఆమిర్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా త‌ర్వాత ప్రేమ‌గా మారి 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, అనూహ్యంగా 2021లో 16 ఏళ్ల వైవాహిక బంధానికి ఈ జంట ముగింపు ప‌లక‌డం గ‌మ‌నార్హం.


More Telugu News