పురాణపండ శ్రీనివాస్ మహాసాధన మామూలు విషయం కాదు.. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్

  • శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంథాన్ని ఆవిష్కరించిన కిషన్‌రెడ్డి
  • తొలి ప్రతిని మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు అందజేత
  • శ్రీనివాస్ దైవీయ లక్ష్యం వెనక అసాధారణ నిస్వార్థ సేవ ఉందని కిషన్‌రెడ్డి ప్రశంస
భక్త జనులకు అపురూప గ్రంథాలు అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దైవీయ చైతన్య లక్ష్యం వెనక అసాధారణ నిస్వార్థ సేవ ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. అందమైన ఆ భాష, భక్తి తన్మయత్వం మామూలు విషయాలు కావని కొనియాడారు. బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ అధ్యక్షురాలు కె. గీతామూర్తి సమర్పణలో పురాణపండ రచనా సంకలనం ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’  దివ్య గ్రంథాన్ని ఆవిష్కరించిన కిషన్‌రెడ్డి తొలి ప్రతిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కు అందించారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బలమైన సంకల్పంతో పవిత్ర మార్గంలో ప్రయాణిస్తున్న పురాణపండ శ్రీనివాస్ అచ్చమైన భక్తితత్వానికి దైవబలం మహాబలంగా మహా మంగళ కార్యాలు చేయిస్తోందని పేర్కొన్నారు. గీతామూర్తి మాట్లాడుతూ.. పవిత్ర శ్రావణ మాసంలో ఈ పవిత్ర కార్యాన్ని తాను భుజాలకెత్తుకోవడం వెనక తన తల్లిదండ్రుల పుణ్యం ఉందన్నారు. ఈ విషయంలో పురాణపండ శ్రీనివాస్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. 

అనంతరం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పలువురికి ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంథాన్ని అందించారు. మరోవైపు రాజమహేంద్రవరంలోని పలు ఆలయాల్లోనూ ఈ గ్రంథాన్ని వితరణ చేశారు.



More Telugu News