రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

 
ఏపీలోని 11 నగరాలు, పట్టణాల్లో అర్బన్ పార్కుల (నగర వనాలు) అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో నగర వనాలను నూతనంగా అభివృద్ధి చేసేందుకు తొలి విడతగా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ రూ.15.4 కోట్లను మంజూరు చేసిందని వివరించారు.

ఈ నిధులతో కర్నూలు, కడప, నెల్లిమర్ల, చిత్తూరు (చిత్తూరు డెయిరీ అర్బన్ పార్కు, కలిగిరి కొండ అర్బన్ పార్కు), శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుకొండ, కదిరి, పలాస, విశాఖపట్నం ప్రాంతాల్లో అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. 

పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలపై పవన్ కల్యాణ్ నేడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 50 శాతం మేరకు పచ్చదనం  ఉండాలని, ఇందులో భాగంగా అర్బన్ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు నిర్దేశించారు. ఆగస్టు 30న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో ప్రధానంగా యువత భాగస్వామ్యం ఉండేలా చూడాలని సూచించారు.


More Telugu News