బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదం... ఆరా తీసిన సీఎం చంద్రబాబు
- సైన్స్ ల్యాబ్ లో ప్రమాదకర వాయువులు విడుదల
- 24 మంది విద్యార్థులకు అస్వస్థత
- బాపట్ల ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
- ప్రాణాపాయం లేదన్న వైద్యులు
- డాక్టర్లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
బాపట్లలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదం జరిగింది. సైన్స్ ల్యాబ్ లో ప్రమాదకర వాయువులు విడుదల కాగా, ఈ వాయువులు పీల్చి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను కేంద్రీయ విద్యాలయ సిబ్బంది హుటాహుటీన బాపట్ల ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు.
కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ముప్పు లేదని వైద్యులు చంద్రబాబుకు తెలిపారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు నిర్దేశించారు.