భానుప్రియకి విపరీతమైన జ్వరం .. అప్పుడు చేసిన ఆ సాంగ్ సూపర్ హిట్: వంశీ
- వంశీ నుంచి వచ్చిన 'ప్రేమించు పెళ్లాడు'
- రాజేంద్రప్రసాద్ - భానుప్రియ జంటగా చేసిన సినిమా
- గోదావరి తీరంలో జరిగిన షూటింగు
- ఆ సినిమా నుంచే కంటిన్యూ అయిన భానుప్రియ పెద్దబొట్టు
వంశీ దర్శకత్వంలో రూపొందిన చెప్పుకోదగిన సినిమాలలో 'ప్రేమించు పెళ్లాడు' ఒకటి. రాజేంద్ర ప్రసాద్ - భానుప్రియ కాంబినేషన్లో నిర్మితమైన ఈ సినిమా, ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను గురించిన వీడియోను తాజాగా వంశీ రిలీజ్ చేశారు.
వంశీ మాట్లాడుతూ .. "కొవ్వూరు దగ్గర గోదావరిలో 'వయ్యారి గోదారమ్మా ఒళ్లంతా ఎందుకమ్మా కలవరం' అనే పాటను చిత్రీకరించాలనుకున్నాము. అందుకు కావలసిన సన్నాహాలు జరుగుతున్నాయి. చెట్టు కొమ్మల మధ్యలో భానుప్రియ ఉంటుంది. చెట్టు క్రింద ఉన్న గ్రూప్ డాన్సర్ల మధ్యలోకి ఆమె దూకాలి. తెరపై అది స్లో మోషన్ లో ఉంటుందన్నమాట. అది స్లో మోషన్ షాట్ అని ఆమెకి చెప్పలేదు. చెబితే ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ గా ప్రిపేరవుతూ ఉంటారని చెప్పలేదు" అన్నారు.
" ఆ పాటలో భానుప్రియ చెట్టు పై నుంచి దూకారు. ఆ తరువాత లొకేషన్ షిఫ్టింగ్ ఉంది. ఆ సమయంలోనే నాకు తెలిసింది .. భానుప్రియ జ్వరంతో బాధపడుతున్నారనీ, అసలు ఆమె షూటింగును వచ్చే పరిస్థితి కాకపోయినా వచ్చారని. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అయితే తన గురించి షాట్స్ మార్చుకోవద్దనీ, తాను చేస్తానని భానుప్రియ కబురు చేశారు. అంత జ్వరంలో ఆమె చేసిన ఆ పాట సూపర్ హిట్ అయింది " అని చెప్పారు.
"ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను 'దోసకాయలపల్లిలో' ప్లాన్ చేశాము. భానుప్రియ కట్టుకోవలసిన చీరను సెలెక్ట్ చేశాను. అదే సమయంలో భానుప్రియ వాళ్లమ్మగారు వచ్చి పెద్ద బొట్టు చూపించి, ఇది ఆమెకి పెడితే బాగుంటుందా అని నన్ను అడిగారు .. సరే పెట్టండి అన్నాను. అంతే ఆ రోజు నుంచి భానుప్రియకి అదే 'పెద్ద బొట్టు' కంటిన్యూ అయింది. ఆ తరువాత సినిమాలలో కొంతమంది హీరోయిన్స్ కి పెద్దబొట్టు పెట్టి, తప్పు చేశానని అనిపించుకున్నాను" అని చెప్పారు.