ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు కారణాలు ఇవే!
- కన్వెన్షన్ కట్టడం అక్రమమని తేల్చిన అధికారులు
- ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధం
- ఈ ఉదయం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ను ఏర్పాటు చేసింది. తాజాగా శనివారం హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. చెరువును ఆక్రమించి కట్టారని, ఆమేరకు కట్టడాలను నేలమట్టం చేసింది.
మాదాపూర్ లో మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో హీరో నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డి సంయుక్తంగా ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారు. దీనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. చెరువు స్థలాన్ని కబ్జా చేసి కట్టారని చాలా మంది విమర్శించారు. ఈ పదెకరాలలో 1.12 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్) పరిధిలో, మరో 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉన్నాయని అధికారులు కూడా గుర్తించారు. దీంతో హైడ్రా అధికారులు తాజాగా ఈ కట్టడాన్ని కూల్చివేశారు.
ఏంటీ ఫుల్ ట్యాంక్ లెవల్..?
వర్షాకాలంలో చెరువులు, కుంటలు నిండుగా ఉంటాయి. నీటితో నిండిన ఈ ప్రాంతం మొత్తాన్ని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్) అంటారు. అన్ని కాలాల్లోనూ నీరు ఈ ఫుల్ ట్యాంక్ లెవల్ ఉండదు. వేసవిలో నీరు తగ్గి ఖాళీ జాగా బయటపడుతుంది. అయినా అదంతా చెరువుకు చెందిన ప్రాంతమే. ఫుల్ ట్యాంక్ లెవల్ ఉన్నపుడు నీరు ఎక్కడి వరకైతే ఉంటుందో అక్కడి వరకు ఎలాంటి నిర్మాణం చేపట్టకూడదు.
ఎఫ్ టీఎల్ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనేది రూల్. దీనిని అతిక్రమించి కట్టిన నిర్మాణాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ఎఫ్ టీఎల్ పరిధిలో పట్టా కలిగిన సాగు భూమి ఉంటే.. నీళ్లు లేని సమయంలో సదరు పట్టాదారు తన భూమిలో పంటలు పండించుకోవచ్చు. నీళ్లతో నిండినపుడు మాత్రం ఎలాంటి హక్కు ఉండదు. ఏ పని చేయడానికి వీలు లేదు.
బఫర్ జోన్ అంటే..?
ప్రతి నీటి వనరును, విస్తీర్ణం ఆధారంగా బఫర్‌జోన్ నిర్ధారిస్తారు. 25 హెక్టార్లు, అంతకుమించి విస్తీర్ణంలో ఉన్న చెరువు, జలాశయాలు బఫర్‌జోన్ నిర్ధారణకు 30 మీటర్లను ప్రామాణికంగా తీసుకుంటారు. జంట జలాశయాల పరిధి చుట్టూ ఎఫ్‌టీఎల్‌ను ఆనుకొని 30 మీటర్లు (వంద ఫీట్లు) బఫర్‌జోన్‌గా ఉంది. ఇక్కడ సాగు సంబంధిత కార్యకలాపాలు మాత్రమే చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టవద్దనే స్పష్టమైన నిబంధన ఉంది.