'రాజా సాబ్' ఎలా ఉంటుందంటే .. :నిర్మాత విశ్వప్రసాద్
- 'మిస్టర్ బచ్చన్' గురించి ప్రస్తావించిన విశ్వప్రసాద్
- ఆ విషయంలో పొరపాటు జరిగిందని వ్యాఖ్య
- ప్రభాస్ క్రేజ్ కి తగినట్టుగా 'రాజా సాబ్' ఉంటుందని వెల్లడి
- పాటలు .. ఫైట్లు హైలైట్ గా నిలుస్తాయన్న నిర్మాత
'మిస్టర్ బచ్చన్' నిర్మాతలలో విశ్వప్రసాద్ ఒకరు. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లకు వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా పరిచయమైంది. అయితే ఈ సినిమాలో ఒకటి రెండు పాటలు .. ఫైట్లు ఆడియన్స్ కి నచ్చాయి. మొత్తంగా చూసుకుంటే ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విషయంలో ఈ సినిమా విఫలమైంది.
వసూళ్ల పరంగా చూసుకుంటే ఈ సినిమా లాభాల దిశగా వెళ్లలేకపోయింది. తాజాగా 'హిట్' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్ మాట్లాడుతూ .. సాధారణంగా కథను .. కాన్సెప్టును .. సందర్భాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. అయితే కొన్ని సమయాల్లో మన నమ్మకం దెబ్బతింటూ ఉంటుంది. 'మిస్టర్ బచ్చన్' విషయంలో అదే జరిగింది" అని అన్నారు.
"త్వరలో మా బ్యానర్ నుంచి 'రాజా సాబ్' రానుంది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ప్రభాస్ మార్కెట్ కి .. ఇమేజ్ కి తగినట్టుగా ఈ సినిమా ఉంటుంది. పాటలు .. ఫైట్లు .. విజువల్ ఎఫెక్ట్స్ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. హారర్ ను .. రొమాన్స్ ను అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు" అని చెప్పారు.