జెలెన్ స్కీ భుజంపై చెయ్యేసి... ఉక్రెయిన్ రాజధానిలో మోదీ పర్యటన

  • ఉక్రెయిన్ లో భారత ప్రధాని పర్యటన
  • కీవ్ లో యుద్ధ మృతులకు నివాళులు అర్పించిన మోదీ
  • ఈ యుద్ధం పిల్లల పాలిట వినాశకరం అంటూ ట్వీట్ 
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో కలిసి రాజధాని కీవ్ లో వివిధ ప్రాంతాలను సందర్శించారు. రష్యా దాడుల్లో మరణించిన ఉక్రెయిన్ ప్రజల స్మారక చిహ్నం వద్ద జెలెన్ స్కీతో కలిసి నివాళులు అర్పించారు. 

తన పర్యటన సందర్భంగా మోదీ... జెలెన్ స్కీని ఆప్యాయంగా హత్తుకున్నారు. యుద్ధంలో జరిగిన నష్టం తాలూకు ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి, బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ భుజంపై ఆత్మీయంగా చెయ్యేసి, తామున్నామన్న భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. 

ఈ యుద్ధం పిల్లల పాలిట వినాశకరం అని పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాల పరిస్థితిని తలచుకుంటే హృదయం ద్రవించిపోతోందని వివరించారు. ఈ కష్టాలను అధిగమించే ధైర్యం వారికి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.


More Telugu News