వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట... బెయిల్ మంజూరు
- ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు పిన్నెల్లిపై మరో కేసు
- ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎన్నికల రోజున పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు పోలీసులపై దాడి కేసుల్లో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ సందర్భంగా పలు షరతులు విధించింది. రూ. 50 వేల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలని, పాస్ పోర్టును అప్పగించాలని, ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని ఆదేశించింది.
పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. పిన్నెల్లి విడుదలవుతున్న నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.