హైదరాబాద్‌లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల పుత్తడి ధర తగ్గి.. 24 క్యారెట్ల ధర పెరుగుదల

  • రూ. 220 తగ్గిన 22 క్యారెట్ల బంగారం ధర
  • అదే సమయంలో రూ. 170 పెరిగిన 24 క్యారెట్ల పుత్తడి ధర
  • వెండి కిలో రూ.91,700గా నమోదు
హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.  22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధరపై రూ. 220 తగ్గి రూ. 66,600కు పడిపోగా, అదే సమయంలో విచిత్రంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 170 పెరిగి రూ. 72,650 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర హైదరాబాద్‌లో కేజీ రూ. 91,700 గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ గత వారం రోజులుగా పుత్తడి ధరలు కొంత తగ్గుతూ ఉండడం గమనార్హం. బంగారం 10 గ్రాముల ధర రూ. 70 వేలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 66 వేలకు అటూఇటుగా నమోదవుతూ వస్తోంది. ఇక్కడ పేర్కొన్న ధరలు ఈ ఉదయం 8 గంటలకు ట్రేడ్ అయినవి మాత్రమే. కొనుగోలు సమయంలో వీటిలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనే ముందు ధరలు ఒకసారి కనుక్కోవడం మంచిది.


More Telugu News