2036 ఒలింపిక్స్‌లో క‌బ‌డ్డీకి చోటు ద‌క్కాలి.. ఆ దిశ‌గా మోదీ చొర‌వ తీసుకోవాలి: పోలండ్ క‌బ‌డ్డీ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు

  • పోలండ్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ
  • మోదీతో పోలండ్ క‌బ‌డ్డీ ఫెడ‌రేష‌న్ ప్రెసిడెంట్ మిచ‌ల్ స్పిక్జో భేటీ
  • మోదీతో మాట్లాడిన త‌ర్వాత పాజిటివ్ ఎన‌ర్జీ వ‌చ్చింద‌న్న స్పిక్జో
  • 2036 ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను నిర్వ‌హించేందుకు భార‌త్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించాల‌ని సూచ‌న‌
భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌స్తుతం పోలండ్‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మోదీతో పోలండ్ క‌బ‌డ్డీ ఫెడ‌రేష‌న్ ప్రెసిడెంట్ మిచ‌ల్ స్పిక్జో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్రీడ‌లు ఒలింపిక్స్‌లో క‌బ‌డ్డీకి చోటు ద‌క్కితే బాగుంటుంద‌ని పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్‌లో క‌బ‌డ్డీకి చోటు ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. ఆ దిశ‌గా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చొర‌వ తీసుకోవాల‌ని కోరారు. కాగా, 2036 ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ‌కు భార‌త్ బిడ్డింగ్ వేస్తుంద‌ని ఇప్ప‌టికే మోదీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 

ప్ర‌ధాని మోదీతో భేటీ అనంత‌రం మిచ‌ల్ స్పిక్జో మాట్లాడుతూ.. "మోదీతో మాట్లాడిన త‌ర్వాత పాజిటివ్ ఎన‌ర్జీ వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. ప్ర‌ధాని మోదీ వ‌ల్ల భార‌త్ అన్ని రంగాల‌లో బలంగా మారుతోంది. క్రీడారంగంలో మునుప‌టి కంటే బ‌లంగా త‌యార‌యింది. ప్ర‌తి క్రీడ‌లోనూ రాణిస్తోంది. అహ్మదాబాద్‌లో భారీ స్టేడియం నిర్మాణంలో మోదీ కృషి ఎంతో ఉంది. అక్క‌డ నేను వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడా. ఇక 2036 ఒలింపిక్స్ విశ్వ‌క్రీడ‌ల‌ను నిర్వ‌హించేందుకు భార‌త్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే బాగుంటుంది. ఆ బిడ్డింగ్‌ను ద‌క్కించుకుంటుంద‌నే అనుకుంటున్నా. అందులో క‌బడ్డీ ఉంటుంద‌ని ఆశిస్తున్నా" అని మిచ‌ల్ స్పిక్జో చెప్పుకొచ్చారు. 


More Telugu News