ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం లభ్యం
- బోట్స్ వానాలోని కరోవే గనిలో లభ్యమైన రెండో అతి పెద్ద వజ్రం
- 2,492 క్యారెట్ల వజ్రం లభ్యమైనట్లు వెల్లడించిన లుకారా డైమండ్ కార్పొరేషన్
- దక్షిణాఫ్రికాలో 1905లో వెలికి తీసిన 3,106 క్యారెట్ల కల్లినల్ వజ్రం ప్రపంచంలో అతి పెద్దది
ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్ వానా ఒకటి. ఈ బోట్స్‌వానాలోని కరోవే గనిలో 2,492 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని లుకారా డైమండ్ కార్పొరేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్ రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని గుర్తించినట్లు పేర్కొంది.
దక్షిణాఫ్రికాలో 1905లో వెలికి తీసిన 3,106 క్యారెట్ల కల్లినల్ వజ్రం ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. అయితే తాజాగా లభ్యమైన ఈ వజ్రం రెండో అతి పెద్దదిగా నిలిచినట్లు లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. అయితే ఈ వజ్రం విలువ, నాణ్యత విషయాలను మాత్రం ఆ సంస్థ తెలియజేయలేదు. అసాధారణమైన ఈ వజ్రం లభ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని కార్పొరేషన్ అధ్యక్షుడు విలియం లాంబ్ పేర్కొన్నారు.