ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఇకపై ఏలూరులోనూ ఆగుతుంది!

 
విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు అదనంగా మరో స్టాప్ ఏర్పాటు చేశారు. ఈ వందేభారత్ రైలు ఇకపై ఏలూరులోనూ ఆగుతుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. 

విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు విజయవాడ నుంచి రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేకపోవడంతో, ఆయా ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు వెసులుబాటు కలగనుంది. 

సికింద్రాబాద్ లో ఉదయం 5.05 గంటలకు బయల్దేరే ఈ వందేభారత్ రైలు ఏలూరులకు 9.49 గంటలకు చేరుకుంటుంది. అటు, విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35 గంటలకు బయల్దేరే వందేభారత్ రైలు ఏలూరుకు సాయంత్రం 5.54 గంటలకు చేరుకుంటుంది. 

ఈ నెల 25 నుంచి వందేభారత్ రైలుకు ఏలూరు స్టాపింగ్ అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.


More Telugu News