రాహుల్ గాంధీకి పెళ్లైందని బంగ్లాదేశ్ బ్లిట్జ్ లో వచ్చింది... ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి?: రఘునందన్
- రాహుల్ గాంధీ విదేశీ జర్నలిస్ట్‌లు రాసే పత్రికలనే నమ్ముతారని ఎద్దేవా
- హిండెన్ బర్గ్‌ను నమ్మిన రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ బ్లిట్జ్‌ను కూడా నమ్మాలని వ్యాఖ్య
- రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నారా? రిలేషన్ షిప్‌లో ఉన్నారా? అని ప్రశ్న
రాహుల్ గాంధీకి పెళ్లైందని బంగ్లాదేశ్ వార్తాపత్రిక బ్లిట్జ్‌లో వార్త వచ్చిందని, ఆ పత్రికలో కాంగ్రెస్ నేతతో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పాలని బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ విదేశీ జర్నలిస్ట్‌లు రాసిన పత్రికలనే నమ్ముతారని ఎద్దేవా చేశారు.
హిండెన్ బర్గ్‌ను నమ్మిన రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ బ్లిట్జ్ పేపర్‌ను కూడా నమ్మాలన్నారు. ఆ పేపర్‌లో రాహుల్ గాంధీ గురించి స్పష్టంగా పేర్కొన్నారన్నారు. కాంగ్రెస్ నేతలు హిండెన్ బర్గ్‌ను నమ్మితే... తాను బ్లిడ్జ్‌ను విశ్వసిస్తానన్నారు. అందులో రాహుల్‌తో పాటు ఉన్న అమ్మాయిలు ఎవరో చెప్పాలన్నారు. ఆమెను రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నారా? లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? తేలాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే ఢిల్లీకి వెళ్లి బ్లిడ్జ్ పేపర్‌ను చూపిస్తానన్నారు.
అదానీ తప్పుడు వ్యక్తి అయితే ఆయనతో ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. సెబీ చైర్ పర్సన్ షేర్లు కొనకూడదా? అని ప్రశ్నించారు. హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎక్కడా అవకతవకలు జరగలేదని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు... అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని, కానీ వాళ్ల పార్టీ నేతలు మాత్రం అదానీ వ్యాపారాన్ని ప్రశ్నిస్తారని మండిపడ్డారు.
"మా తమ్ముడు దందా చేయవద్దా?" అని రేవంత్ రెడ్డి అంటున్నారని, ముందు దందా అని దేనిని అంటారో ముఖ్యమంత్రి తెలుసుకోవాలని సూచించారు. అక్రమ పనులను దందా అంటారని తెలుసుకోవాలన్నారు. బాంబే రెడ్ లైట్ ఏరియాకు వెళితే దందా అంటే ఏమిటో చెబుతారన్నారు. ప్రధాని మోదీపై ఇష్టానుసారంగా మాట్లాడితే బీఆర్ఎస్‌కు ఏ గతి పట్టిందో తెలుసుకోవాలన్నారు.