వ్యక్తిగత భద్రతను నిరాకరించిన ఎమ్మెల్సీ కోదండరాం
- ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన కోదండరాం
- నేను ప్రజల మనిషిని.. వ్యక్తిగత భద్రత అవసరం లేదన్న కోదండరాం
- సెక్యూరిటీ ఉంటే ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశముంటుందని వెల్లడి
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం తనకు వ్యక్తిగత భద్రతను నిరాకరించారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం సెక్యూరిటీని కేటాయించింది. అయితే తనకు కేటాయించిన సెక్యూరిటీని ఆయన నిరాకరించారు.
తాను ప్రజల మనిషినని... వ్యక్తిగత భద్రత అవసరం లేదన్నారు. సెక్యూరిటీ ఉంటే ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నారు. సెక్యూరిటీ లేకుంటేనే ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరిస్తారన్నారు.