టీమిండియాకు మరో రెండు లక్ష్యాలు ఉన్నాయి: జై షా

  • టీ20 ప్రపంచకప్ కొడతామని తాము చెప్పామన్న జై షా
  • చెప్పినట్టుగానే కప్ కొట్టామని వెల్లడి
  • ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్ షిప్ మన ముందున్న లక్ష్యాలని వెల్లడి
2024 టీ20 ప్రపంచకప్ లో భారత జెండా ఎగురవేస్తామని తాము చెప్పామని... తాము చెప్పినట్టుగానే రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ప్రపంచకప్ విజేతగా నిలిచిందని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. ప్రస్తుతం మరో రెండు లక్ష్యాలు టీమిండియా ముందు ఉన్నాయని చెప్పారు. 

ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో జయకేతనం ఎగురవేయడం మన ముందున్న రెండు లక్ష్యాలని... ఈ రెండు లక్ష్యాలను రోహిత్ కెప్టెన్సీలోనే సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 

140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదాలు భారత జట్టుపై ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ లో మహిళల టీ20 ప్రపంచకప్ కూడా ఉందని... మన జట్టు బలంగా ఉందని... తప్పకుండా మనం మరో కప్ కొడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News