చిరంజీవి వెండితెర ఆణిముత్యం: ఏపీ సీఎం చంద్రబాబు

చిరంజీవి వెండితెర ఆణిముత్యం: ఏపీ సీఎం చంద్రబాబు
  • నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు
  • హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ 
  • చెక్కుచెదరని ప్రేక్షకాభిమానం చిరంజీవి సొంతం అంటూ వెల్లడి 
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా చిరంజీవికి విషెస్ తెలియజేశారు. "పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

స్వయంకృషితో సినీ రంగంలో ఎన్నో విజయాలు అందుకుని, ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వెండితెర ఆణిముత్యం అని కొనియాడారు. 

"తరాలు మారినా చెక్కుచెదరని ప్రేక్షకాభిమానం ఆయన సొంతం. చిరంజీవి గారు స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. ఆయన మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పేరు సార్ధకం చేసుకునేలా ఆయన చిరంజీవిగా ఉండాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు  ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అంటూ చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.


More Telugu News