రాత్రివేళ ఉచిత రవాణా సదుపాయం ప్రచారంపై స్పందించిన హైదరాబాద్ పోలీస్
- రాత్రి వేళల్లో ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఇంటివద్ద దింపుతారంటూ ప్రచారం
- రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఫోన్ చేస్తే పోలీసులు వస్తారని సారాంశం
- మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందన్న హైదరాబాద్ పోలీసులు
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. రాత్రివేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి వాటితో కొందరు నెటిజన్లు తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.
1091, 78370 18555 నెంబర్లకు ఫోన్ చేస్తే స్థానిక పోలీసు వాహనం వచ్చి మహిళలను ఇంటి వద్ద దింపుతోందని సోషల్ మీడియాలో వస్తోందని, కానీ అందులో వాస్తవం లేదని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. రాత్రి వేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.