జగన్ పాపమే కార్మికుల పాలిట శాపం: టీడీపీ
- అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం
- 17 మంది మృతి, 60 మందికి తీవ్ర గాయాలు
- ఈ నేపథ్యంలో 'ఎక్స్' వేదికగా గత వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శ
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో సంభవించిన ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ప్రమాదానికి కారణం గత ప్రభుత్వమేనని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా టీడీపీ ఆరోపించింది.
ప్రభుత్వం చేయాల్సిన సేఫ్టీ ఆడిట్‌ను థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయిస్తానని గతంలో జగన్ చెప్పారని, అది కూడా సరిగ్గా చేయించకపోవడం వల్లే ఇప్పుడీ ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ పేర్కొంది. సేఫ్టీ లొసుగులు ఉన్న కంపెనీలను బెదిరించి డబ్బులు దండుకున్నారు. అందుకే ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత వైసీపీ హయాంలో వరుసగా 15 ప్రమాదాలు జరిగాయని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ కు ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ప్రమాదం తాలూకు దృశ్యాలతో ఒక ఫొటోను జత చేసింది. దానిపై 'జగన్ పాపమే కార్మికుల పాలిట శాపం' అనే లైన్‌ను టీడీపీ హైలైట్ చేసింది. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.