కోల్‌కతా హత్యాచార ఘటన.. ర్యాలీ నిర్వహించిన గంగూలీ భార్య, కుమార్తె
- కోల్‌కతాలో గంగూలీ నివసించే బెహలా ప్రాంతంలో ర్యాలీ
- పొద్దున్న లేస్తే ఇవే వార్తలంటూ సానా గంగూలీ ఆవేదన
- బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగించాల్సిందేనని స్పష్టీకరణ
‘‘మాకు న్యాయం కావాలి.. పొద్దున్న లేస్తే ఆడపిల్లలపై అఘాయిత్యాలు, హత్యల వార్తలే. ఇకనైనా వీటికి ఫుల్‌స్టాప్ పెట్టాలి’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సానా గంగూలీ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలోని వారు నివాసముండే బెహలా ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు.
ఇందులో గంగూలీ భార్య, ప్రముఖ ఒడిస్సీ డ్యాన్సర్ అయినా డోనా గంగూలీ, కుమార్తె సానా పాల్గొన్నారు. అనంతరం సానా గంగూలీ మాట్లాడుతూ.. వైద్యురాలిపై జరిగిన దారుణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2024లోనూ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. తమకు న్యాయం జరగాలని, ఇటువంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసనలు, ఆందోళనలు కొనసాగించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.