అచ్యుతాపురం ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం చెల్లించాలన్న జగన్
- గాయపడిన వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని సూచన
- ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా 17 మంది అసువులు బాయగా, మరి కొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని కోరారు. వారు కోలుకునేంత వరకూ ఆర్ధిక సహాయం చేయాలని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.