స్వల్ప లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

  • 102 పాయింట్ల లాభాల్లో సెన్సెక్స్, 71 పాయింట్ల లాభాల్లో నిఫ్టీ ముగింపు
  • 1.3 శాతం లాభపడిన రియాల్టీ రంగం
  • ఫెడ్ నిర్ణయాల కోసం ఇన్వెస్టర్ల వేచి చూపు
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు లాభపడి 80,905 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు ఎగిసి 24,770 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ స్టాక్స్‌లో దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, సిప్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు టాప్ లూజర్లుగా నిలిచాయి.

రంగాలవారీగా చూస్తే, రియల్టీ ఇండెక్స్ 1.3 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.2 శాతం క్షీణించాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, మెటల్, టెలికాం, మీడియా 0.5 నుంచి 1 శాతం లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం ఎగిసిపడింది.

ఇన్వెస్టర్లు ఫెడ్ పాలసీ నిర్ణయాల కోసం వేచి చూస్తున్నారు. దీంతో అంతర్జాతీయ, దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు, మార్కెట్ నుంచి ప్రభావితం చేసే అంశాలు ఏమీ లేకపోవడంతో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో భారత కరెన్సీ రూపాయి 14 పైసలు క్షీణించి 83.93 వద్ద స్థిరపడింది. నిన్న రూపాయి 83.79 వద్ద ముగిసింది.


More Telugu News