రాంచీలో లోకల్ ధాబాలో స్నేహితులతో చిల్ అవుతున్న ధోనీ .. నెట్టింట ఫొటో వైరల్!
- తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడుపుతున్న ధోనీ
- 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్‌డీ
- అప్పటి నుంచి ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న భారత మాజీ క్రికెటర్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నాడు. ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.
తాజాగా ధోనీ తన స్నేహితులతో కలిసి చిల్ అవుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాంచీలోని ఓ లోకల్ ధాబాలో తన మిత్రులతో కలిసి లంచ్‌ను ఎంజాయ్ చేశారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించి టైమ్ స్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక యువ భారత పేసర్ ఖలీల్ అహ్మద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోనీ తనకు గురువుతో సమానం అన్నారు.
ఇక ఐపీఎల్‌లో ధోనీ తన సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత 2024లో మాత్రం 17వ సీజన్‌కు ముందు కెప్టెన్సీ వదిలేశాడు. తన వారసుడిగా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించి వికెట్ కీపర్‌గా కొనసాగాడు. ఈ సీజన్‌లో మోకాలి నొప్పితో బాధపడుతూనే సీజన్ మొత్తం ఆడాడు.
అయితే, ప్రస్తుతం ధోనీ మరో సీజన్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఏ సమయంలోనైనా అతడు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో ధోనీ ఐపీఎల్ 2025 సీజన్ ఆడతాడా? లేదా? అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కాగా, ధోనీ 18వ సీజన్‌లో కొత్త అవతారంలో సీఎస్‌కేకి అండగా నిలిచే అవకాశముందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.