పికిల్ బాల్ లీగ్... చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సమంత
- కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన నటి సమంత
- స్పెషల్ సర్ ప్రైజ్ అంటూ ప్రకటించిన సమంత
- చెన్నై టీమ్ యజమానిగా ఉండటం ఆనందంగా ఉందన్న సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత .. ప్రస్తుతం బాలివూడ్ నటుడు వరుణ్‌ధావన్ తో కలిసి ‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో నవంబర్ 7న విడుదల కానుంది. చివరి సారిగా ఖుషి చిత్రంలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నానంటూ నిన్న సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో దాన్ని చూసిన అభిమానులు .. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏమైనా చెబుతారేమోనని ఆసక్తిగా చూశారు. కొత్త సినిమా ప్రకటన ఉండవచ్చేమోనని మరి కొందరు భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా స్పెషల్ సర్ ప్రైజ్ ను సమంత ఇచ్చింది.
తాను కొత్త ప్రయాణం మొదలు పెట్టినట్లుగా వెల్లడించింది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. చెన్నై టీమ్ కు యజమానిగా ఉండటం అనందంగా ఉందని అంటూ సోషల్ మీడియాలో సమంత పోస్టు పెట్టారు. న్యూ బిగినింగ్ హ్యాష్ ట్యాగ్ జోడించారు.
పికిల్ బాల్ గేమ్ విషయానికి వస్తే .. ఇది టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ను పోలి ఉంటుంది. అయితే దీనికి ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి. 1965లో అమెరికాలో మొదలైన ఈ గేమ్ కు మన దగ్గర ఆదరణ లభిస్తొంది. ఇండోర్, అవుట్ డోర్ లో ఈ ఆటను ఆడొచ్చు, సింగిల్స్ లో ఇద్దరు, డబుల్స్ లో నలుగురు ఆడతారు.