బీహార్‌లో ఆర్‌జేడీ నేత దారుణ హ‌త్య‌!

బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంక‌జ్‌రాజ్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. హాజీపుర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న ఇంటి స‌మీపంలో కూర్చున్న కౌన్సిల‌ర్ పంక‌జ్‌రాజ్‌పై దుండ‌గులు ఒక్క‌సారిగా కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. 

వెంట‌నే ఆయ‌న ఇంట్లోకి ప‌రిగెత్తినా దుండగులు వెన‌క్కి త‌గ్గ‌కుండా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో పంక‌జ్‌రాజ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై మాజీ డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నితీశ్‌, ఎన్‌డీఏ ప్ర‌భుత్వంపై ఆయ‌న‌ విమ‌ర్శ‌లు గుప్పించారు.


More Telugu News