ఏపీలో సీబీఐ విచారణకు అనుమతినిస్తూ గెజిట్ విడుదల

  • 2014-19 మధ్య కాలంలో సీబీఐకి ఏపీలో నో చెప్పిన టీడీపీ సర్కారు
  • మళ్లీ ఇప్పుడు సీబీఐకి అనుమతి ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్
  • సీబీఐ విచారణ పరిధి పెంపు
ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతికి పాల్పడిన ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపై ఇకమీదట సీబీఐ నేరుగా విచారణ జరిపేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ నోటిఫికేషన్ ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు సీబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. 

ఏపీలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు, పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థాపక చట్టం-1946లోని సెక్షన్-3 ప్రకారం సీబీఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా గెజిట్ లో పేర్కొంది. తద్వారా సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతినిచ్చినట్టయింది. 

2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వమే అనుమతి నిరాకరించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం గమనార్హం.


More Telugu News