కాంగ్రెస్‌లో చేరిన ఆ ఇద్దరికి కీలక పదవులు

కాంగ్రెస్‌లో చేరిన ఆ ఇద్దరికి కీలక పదవులు
  • ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి
  • వ్యవసాయ సలహాదారుడిగా పోచారం నియామకం
  • రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార చైర్మన్‌గా అమిత్ రెడ్డి నియామకం
బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డిలకు కీలక పదవులు దక్కాయి. పోచారంను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాలో ఆయనను సలహాదారుడిగా నియమించింది. గుత్తా అమిత్ రెడ్డిని రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా నియమించింది. అమిత్ రెడ్డి రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.


More Telugu News