జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ జీవో
- హెచ్ఎండీఏ, మూసీ అభివృద్ధి, హెచ్‌జీసీఎల్ అదనపు బాధ్యతల నుంచి రిలీవ్
- రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ... అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు
- మూసీ అభివృద్ధి కార్పోరేషన్ ఎండీగా దానకిశోర్
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమ్రపాలిని హెచ్ఎండీఏ, మూసీ అభివృద్ధి, హెచ్‌జీసీఎల్ అదనపు బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది.
మూసీ అభివృద్ధి కార్పోరేషన్ ఎండీగా దానకిశోర్‌కు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాస్తవ నియమితులయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్‌గా చహత్ బాజ్ పాయ్, హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్‌ను నియమించారు.