బాలినేని పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

  • ఒంగోలులో నిన్న ఈవీఎంల రీవెరిఫికేషన్
  • వాకౌట్ చేసిన మాజీ మంత్రి బాలినేని ప్రతినిధులు
  • నిలిచిన రీవెరిఫికేషన్ ప్రక్రియ
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాలినేని
ఈవీఎంల రీవెరిఫికేషన్ పై అభ్యంతరాలు ఉన్నాయంటూ వైసీపీ నేత, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

మాక్ పోలింగ్ వద్దని, 12 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో ఓట్లు రీకౌంటింగ్ చేయాలని బాలినేని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో, బాలినేని పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అభ్యంతరాలు ఉన్న ఈవీఎంలలోని ఓట్లను లెక్కించాలని, వాటిని వీవీ ప్యాట్లతో సరిపోల్చాలని బాలినేని తరఫు న్యాయవాది విన్నవించారు. మాక్ పోలింగ్ పై ఇప్పటికే ఉత్తర్వులు ఉన్నాయని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వివరించారు. 

వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


More Telugu News