ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు
- చంద్రబాబు సర్కార్ కీలక ఆదేశాలు
- ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత ఫోటోలు అప్ లోడ్ చేసే బాధ్యతలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగింత
టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రత ఫొటోలను అప్ లోడ్ చేసే బాధ్యతను కూడా గ్రామ, వార్డు సచివాలయాలకు విద్యాశాఖ అప్పగించింది.
ప్రతి సోమ, గురువారాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించాలని, మరుగుదొడ్ల ఫొటోలను తీసి అప్ లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందు కోసం ఐఎంఎంఎస్ యాప్ లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం ఇచ్చింది.