వచ్చే ఐపీఎల్ లో ఆర్సీబీపై కన్నేసిన రింకూ సింగ్!

  • కోల్‌కతాకు హ్యాండ్ ఇచ్చేలా యువ బ్యాటర్ రింకూ సింగ్ కీలక వ్యాఖ్యలు
  • ఐపీఎల్ 16వ సీజన్ లో ఆరు సిక్స్ లతో ఒక్కసారిగా హీరోగా మారి ఆసియా గేమ్స్ లో భారత జట్టుకు ఆడిన రింకూ సింగ్
  • కోల్‌కతా వద్దనుకుంటే ఆర్సీబీకి ఆడతానని రింకూ సింగ్ వెల్లడి
యువ బ్యాటర్ రింకూ సింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) పై కన్నేసినట్లుగా కనబడుతోంది. ఐపీఎల్ 18వ సేజన్ లో రింకూ సింగ్ పై కోల్‌కతా భారీ ఆశలే పెట్టుకున్నా, ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఈ యువ బ్యాటర్ ఆ ఫ్రాంచైజీకి షాక్ ఇచ్చేలా ఉన్నాడు. ఒక‌వేళ కేకేఆర్ వ‌చ్చే మెగా వేలంలో త‌న‌ను వ‌దిలేస్తే.. క‌చ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ఆడతాన‌ని చెప్ప‌డం అందుకు నిద‌ర్శ‌నం.

16వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ పై ఆఖరి ఓవర్ లో అయిదు సిక్స్ లతో రింకూ ఒక్కసారిగా హీరోగా మారాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ త‌ర్వాత‌ ఆసియా గేమ్స్ (2023) లో భారత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఐపీఎల్ 17వ సీజన్ లో ఈ యువ ఆట‌గాడికి ఛాన్సే లభించలేదు. దానికి తోడు నాలుగైదు ఇన్సింగ్స్ ఆడినా గతంలో మాదిరిగా ఆటను ప్రదర్శించలేకపోయాడు. దీంతో.. ఈ సారి రింకూ సింగ్ ను కోల్‌కతా వదిలివేస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అతను కూడా కొత్త జట్టుకు మారేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం వస్తున్న వదంతులపై రింకూ సింగ్ స్పందించారు. తనను కోల్‌కతా అట్టిపెట్టుకుంటుందా? లేదా? మే నెలలో మెగా వేలం జరుగుతుందా? అనేది ఇప్పటికైతే ఏమీ తెలియదని, ఏమి జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించాడు. ఒకవేళ తనను కోల్‌కతా వద్దనుకుంటే మాత్రం ఆర్‌సీబీకి ఆడతానని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.


More Telugu News