కైలాసపట్నం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • అనకాపల్లి జిల్లాలో ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్
  • అస్వస్థతకు గురైన విద్యార్థులు
  • చికిత్స పొందుతూ ముగ్గురు చిన్నారుల మృతి
  • అనధికార హాస్టల్ మూసివేయాలన్న సీఎం చంద్రబాబు
  • చిన్నారుల బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుందని వెల్లడి
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఓ అనాథాశ్రమంలో కలుషితాహారం తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విద్యార్థుల మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. 

అనధికార హాస్టల్ ను మూసివేయాలని ఆదేశించారు. ఆ అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. అస్వస్థతకు గురైన చిన్నారుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.


More Telugu News