కలుషిత ఆహారం తిని చిన్నారులు మృతి చెందిన ఘటన తీవ్రంగా కలచివేసింది: నారా లోకేశ్

  • అనకాపల్లి జిల్లాలో ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్
  • నిన్న సమోసాలు తిని అస్వస్థతకు గురైన చిన్నారులు
  • చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
  • భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్న నారా లోకేశ్
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 

కలుషితాహారం తిని జాషువా, భవాని, శ్రద్ధ అనే విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై క్యాబినెట్ సహచరుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తోనూ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడానని లోకేశ్ వెల్లడించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు 

మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరుతున్నానని వివరించారు.


More Telugu News