ఆచితూచి వ్యవహరించిన ఇన్వెస్టర్లు... ఫ్లాట్ గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

  • ఈ వారంలో అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ నిర్ణయాల వెల్లడి
  • అంతర్జాతీయ మార్కెట్లలో నిరాశాజనక ట్రేడింగ్
  • కుదుపులకు లోనైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు
  • 12 పాయింట్ల నష్టం చవిచూసిన సెన్సెక్స్... 31 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
మరికొన్నిరోజుల్లో అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ  నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్ పై ఆ ప్రభావం కనిపించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు కూడా నిరాశాజనకంగా ట్రేడింగ్ జరిపాయి.

ఈ నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నేడు ఫ్లాట్ గా ముగిశాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దాంతో, సెన్సెక్స్ 12.16 పాయింట్ల నష్టంతో 80,426.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.50 పాయింట్ల వృద్ధితో 24,572.65 వద్ద ముగిసింది. 

శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎల్టీఐ మైండ్ ట్రీ, భారత్ పెట్రోలియం, టాటా స్టీల్ షేర్లు లాభాల బాటలో పయనించగా... యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలు చవిచూశాయి. 

కాగా, రూపాయితో డాలర్ మారకం విలువ రూ.83.87గా ఉంది.


More Telugu News