ప్రభాస్ లేని 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
- హైదరాబాదులో క్షత్రియ సేవా సమితి అభినందన సభ
- హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- బాహుబలి హాలీవుడ్ వరకు వెళ్లిందంటే ప్రభాసే కారణమని వెల్లడి
- రాజులు ఏ రంగంలో ఉన్నా రాణిస్తారని కితాబు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ లేని బాహుబలిని ఊహించలేమని అన్నారు. బాహుబలి చిత్రం టాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్ తో పోటీపడగలిగిందంటే అందుకు కారణం ప్రభాస్ అని తెలిపారు.
ఇవాళ హైదరాబాదులో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. రాజులు ఏ రంగంలోకి వచ్చినా రాణిస్తారని, కృష్ణంరాజు పేరు ప్రస్తావించకుండా తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడలేమని అన్నారు. బాలీవుడ్ లో రాణించిన రాంగోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని తెలిపారు.
"నాకన్నా గొప్ప వాళ్లు ఇవాళ ఈ వేదిక ముందు వినయంగా ఉన్నారు... క్షత్రియుల గొప్పదనం అదే. నమ్మకానికైనా, విజయానికైనా క్షత్రియులు మారు పేరుగా నిలుస్తారు" అని రేవంత్ రెడ్డి వివరించారు.