కృష్ణ, విజయనిర్మల విగ్రహాలతో స్ఫూర్తివనం నిర్మించిన నరేశ్... వీడియో ఇదిగో!
- హైదరాబాదు శివార్లలో స్ఫూర్తివనం నిర్మించిన నరేశ్
- ప్రారంభోత్సవానికి హాజరైన జాకీ ష్రాఫ్, మురళీమోహన్ తదితరులు
- ప్రత్యేక ఆకర్షణగా కృష్ణ, విజయనిర్మల విగ్రహాలు
సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య విజయనిర్మల మూడేళ్ల వ్యవధిలో ఈ లోకాన్ని విడిచారు. విజయనిర్మల 2019లో కన్నుమూయగా, కృష్ణ 2022లో తుదిశ్వాస విడిచారు. వీరిద్దరి మధ్య ప్రగాఢ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కాగా... కృష్ణ, విజయనిర్మల జ్ఞాపకార్థం హైదరాబాద్ శివార్లలోని డాక్టర్ నరేశ్ గార్డెన్స్ లో ఓ స్ఫూర్తివనం రూపుదిద్దుకుంది. విజయనిర్మల తనయుడు నరేశ్ ఈ స్ఫూర్తివనం నిర్మించారు. ఇక్కడ కృష్ణ, విజయనిర్మల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ స్ఫూర్తివనం ప్రారంభోత్సవానికి బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ హాజరవడం విశేషం. జాకీ ష్రాఫ్ స్ఫూర్తివనం స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు.
తెలుగు సీనియర్ నటుడు మురళీమోహన్, గోపీచంద్, అలీ, దర్శకుడు శ్రీను వైట్ల తదితరులు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నరేశ్, పవిత్ర పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు కృష్ణ, విజయనిర్మల విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించారు.