ఏపీకి 'గ్రీన్ ఎనర్జీ చాంపియన్' అవార్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 'గ్రీన్ ఎనర్జీ చాంపియన్' అవార్డు లభించింది. ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ 2023-24 సంవత్సరానికి గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ఏపీని ప్రకటించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. 

ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం. కమలాకర్ బాబు కేంద్ర నూతన, పునరత్పాదక ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి లలిత్ బోరా నుంచి అవార్డు స్వీకరించారు. ఈ అవార్డు కోసం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు పోటీ పడినా, ఏపీ వాటిని అధిగమించింది.

కాగా, అవార్డు అందుకున్న సందర్భంగా కమలాకర్ బాబు మాట్లాడుతూ... ఈ అవార్డు ఏపీకి దక్కిందంటే ఆ ఘనత సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. గతంలో 2014-19 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో చేసిన కృషి ఇప్పుడు అవార్డు రావడానికి కారణమైందని వివరించారు.


More Telugu News