హీరో విజయ్ పార్టీతో పొత్తుపై మా పార్టీ అగ్రనేతలు నిర్ణయిస్తారు: కుష్బూ
- కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించిన హీరో విజయ్
- విజయ్ ఎంతో తెలివైనవాడన్న కుష్బూ
- సోదరుడి వంటివాడని వెల్లడి
తమిళ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే). తాజాగా, టీవీకే అంశంపై ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత కుష్బూ స్పందించారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీతో పొత్తుపై బీజేపీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
విజయ్ రాజకీయాలకు కొత్త... అతనికి మీరేమైనా సలహా ఇస్తారా? అనే ప్రశ్నకు కుష్బూ స్పందిస్తూ... "విజయ్ ఎంతో తెలివైన వ్యక్తి. నాకు సోదరుడు వంటివాడు... ఆయనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అని బదులిచ్చారు.
కాగా, కుష్బూ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు. ప్రజలతో కలిసి మరింత పనిచేసేందుకు వీలుగా ఆ పదవిని వదులుకున్నానని చెప్పారు. తాను రాజకీయ నేతనని, తనవంటి వారు జాతీయ మహిళా కమిషన్ వంటి సంస్థల్లో కొనసాగడం కంటే క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేయాల్సిన అవసరమే ఎక్కువగా ఉంటుందని కుష్బూ వివరించారు.
మహిళా కమిషన్ సభ్యత్వం నుంచి వైదొలగుతానన్న విషయాన్ని ఏడు నెలల కిందటే బీజేపీ అధినాయకత్వానికి చెప్పానని, అయితే పదవిలో కొనసాగాలని అగ్రనేతలు సలహా ఇచ్చారని వెల్లడించారు.