బీఆర్ఎస్ రుణమాఫీ చేస్తే రైతులకు వడ్డీకి కూడా సరిపోలేదు: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

  • కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీత
  • రుణమాఫీ చేశాకే హరీశ్ రావు రాజీనామాను అడుగుతున్నామని వెల్లడి
  • మంచి చేసి ఉంటే బీఆర్ఎస్‌ను ఎందుకు ఓడించారో చెప్పాలని నిలదీత
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన రుణమాఫీ... రైతులకు కనీసం వడ్డీ చెల్లించడానికి కూడా సరిపోలేదని, కానీ ఇప్పుడు తాము ఎనిమిది నెలల కాలంలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పూర్తి రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.

2018లోనూ మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారని, కానీ 2023 వరకు గత ప్రభుత్వానికి రైతులు గుర్తుకు రాలేదని విమర్శించారు. తాము రుణమాఫీ హామీని నిలబెట్టుకున్న తర్వాతే హరీశ్ రావును రాజీనామా చేయమని అడుగుతున్నామని పేర్కొన్నారు. కానీ ఆయన నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేసి ఉంటే బీఆర్ఎస్‌ను ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలని నిలదీశారు.


More Telugu News