సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్.. విచారణకు ఆదేశించిన గవర్నర్
- మైసూరులో ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణం
- సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశం
- గవర్నర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సిద్దూ కేబినెట్ మండిపాటు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రదీప్ కుమార్, అబ్రహాం, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు.
గవర్నర్ ఆదేశాల మేరకు... ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవినీతి నిరోధక చట్టం 1988, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 కింద... ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తున్నట్టు గవర్నర్ సెక్రటేరియట్ లేఖను విడుదల చేసింది.
గవర్నర్ ఆదేశాలకు సంబంధించిన లేఖ తమకు అందిందని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వెల్లడించింది. మరోవైపు గతంలో ఇదే అంశంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ... రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలపై సిద్ధరామయ్య కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగబద్ధమైన కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది. సిద్ధరామయ్యపై గవర్నర్ విచారణకు ఆదేశించడం ప్రస్తుతం కర్ణాటకలో దుమారం రేపుతోంది.