అన్నమయ్య జిల్లాలో దారుణం .. గ్యాస్ సిలెండర్ పేలి ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి
- అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో దుర్ఘటన
- సీసీ టీవీ పుటేజీ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- కువైట్ లో ఉన్న భర్తతో తరచు గొడవలు
- ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేశారా అన్న కోణంలోనూ పోలీసుల విచారణ
అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి మండలం కొత్తపేటలో గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో వివాహిత, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కొత్తపేటలోని తోగట వీధిలో గల ఓ ఇంటిలో గ్యాస్ సిలెండర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంపై స్థానికులు వెంటనే పోలీస్, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో లక్కిరెడ్డిపల్లి మండలం ఎర్రగుడికి చెందిన రమాదేవి (34), ఇద్దరు పిల్లలు మనోహర్ (8), మన్విత (5) మృతి చెందారు. రాయచోటి డీఎస్పీ రామచంద్రయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో సీసీ కెమెరా పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన రమాదేవి భర్త రాజు జీవనాధారం కోసం కువైట్ లో ఉంటున్నాడు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా కావాలనే చేశారా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. ప్రమాదంలో తల్లి సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందడం స్థానికుల హృదయాలను కలచివేసింది.