ముంబై బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం.. వీడియో ఇదిగో!
- అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకిన మహిళ
- చివరి క్షణంలో పడిపోకుండా పట్టుకున్న క్యాబ్ డ్రైవర్
- మహిళను పైకి లాగిన పోలీసులు
ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి సముద్రంలో దూకేందుకు ప్రయత్నించింది. బ్రిడ్జి రెయిలింగ్ దాటుకుని కిందకు దూకుతుండగా చివరిక్షణంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను పట్టుకున్నాడు. అప్పటికే అక్కడున్న పోలీసులు కూడా వెంటనే స్పందించి మహిళను కాపాడారు. శుక్రవారం సాయంత్రం అటల్ సేతు బ్రిడ్జిపై చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియోను ముంబై పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
సూసైడ్ అటెంప్ట్ చేసిన మహిళ పేరు రీమా ముఖేశ్ పటేల్ అని, నార్త్ ఈస్ట్ ముంబైలోని ములంద్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. దూకడానికి ముందుగా రీమా తన చేతిలో ఉన్నదానిని సముద్రంలో పడేయడం వీడియోలో కనిపించింది. క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తి, బ్రిడ్జిపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వెంటనే స్పందించడంతో రీమా ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘జీవితం విలువ గుర్తించాలి, పరిస్థితులు ఎలా మారినా ఇలాంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు’ అంటూ నగర పౌరులకు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ విజ్ఞప్తి చేశారు.