రేవంత్ రెడ్డి సర్కారును ప్రశంసించిన బీజేపీ ఎంపీ... ఎందుకంటే?
- ఎక్స్ వేదికగా స్పందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- సరస్సులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాల కూల్చివేతను అభినందించిన ఎంపీ
- హైడ్రా చర్యను అభినందిస్తున్నానని వెల్లడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ అంశంపై రేవంత్ రెడ్డి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ మంచి చేస్తే అభినందించాలని... అలాగే తప్పు చేస్తే విమర్శలు చేయాలి.. నిలదీయాలని పేర్కొన్నారు.
సరస్సులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినందుకు ఓ బీజేపీ నాయకుడిగా అభినందిస్తున్నానని... ఇది తనకు సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో తప్పు చేస్తే ఈ ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. సరస్సులను కాపాడటానికి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో హైడ్రా చర్యను తాను అభినందిస్తున్నానన్నారు. దీనిని వారు కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు.