ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కోచ్... జై షా ఏమన్నారంటే...!
- ఇటీవల టీమిండియా కోచ్ గా గంభీర్ నియామకం
- శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గి... వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా
- ఒక్కో ఫార్మాట్ లో ఒక్కో కోచ్ ఉండాలన్న వాదనపై జై షా స్పందన
ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. గంభీర్ కోచ్ గా టీమిండియా జట్టు శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి శుభారంభం చేసింది.
అయితే, వన్డే సిరీస్ లో మాత్రం టీమిండియా ఓడిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ వన్డే సిరీస్ ను శ్రీలంకకు అప్పగించించింది. దాంతో, టీమిండియాకు ఒక్కో ఫార్మాట్ లో ఒక్కో కోచ్ గా ఉండాలన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది.
ఈ హైబ్రిడ్ విధానంపై బీసీసీఐ కార్యదర్శి జై షా ఆసక్తికరంగా స్పందించారు. గంభీర్ ను అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా కోచ్ గా నియమించామని స్పష్టం చేశారు.
"మేం నియమించిన కోచ్ ఏం చెబుతాడో వినాల్సిన బాధ్యత మాపై ఉంది. ఒక్కసారి గంభీర్ ను మేం కోచ్ గా నియమించాక, ఆయన అన్ని ఫార్మాట్లలో కోచ్ గా ఉంటానని ఒప్పుకున్నాక... మీరు ఫలానా ఫార్మాట్ లో కోచ్ గా పనికిరారండీ అని చెప్పడానికి నేనెవర్ని. టీమిండియాకు సంబంధించి 70 శాతం మంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారు" అని జై షా వివరించారు.