భాక్రానంగల్ తెలంగాణలో ఉందన్నది ఎంత నిజమో... రుణమాఫీ అంతే నిజం: నిరంజన్ రెడ్డి
- పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి
- 60 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికి మాత్రమే చేశారని వెల్లడి
- బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ కోసం రూ.29 వేల కోట్లు కేటాయించామన్న మాజీ మంత్రి
భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందన్నది ఎంత నిజమో... రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నది అంతే నిజమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండించారు. దిల్ సుఖ్ నగర్‌లో విమానాలు అమ్మడం ఎంత నిజమో రుణమాఫీ కూడా అంతే నిజమని కూడా ఎద్దేవా చేశారు.
తెలంగాణలో 70 లక్షల మంది రైతులు ఉండగా, 60 లక్షల మంది రుణాలు తీసుకున్నవారు ఉన్నారని, ప్రభుత్వం మాత్రం 44 లక్షల మంది అని లెక్క చెప్పి... 22 లక్షల మందికి మాత్రమే మాఫీ చేసిందన్నారు. రుణమాఫీపై మీడియా ప్రకటనలకే రూ.300 కోట్లు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీకి రూ.29 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. రైతు బంధు కోసం మరో రూ.72 వేల కోట్లు కేటాయించామన్నారు.