రేవంత్ రెడ్డి త్వరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు: కేటీఆర్ వ్యంగ్యం
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్న సీఎం వ్యాఖ్యలకు కౌంటర్
- ఆయన చెప్పినటుంటి స్టోరీలు తానూ అల్లగలనని వ్యాఖ్య
- అమెరికాకు ట్రంప్ సరిపోవడం లేదని.. రేవంత్‌ను పిలుస్తున్నారేమోనని వ్యంగ్యం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని, కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్రమంత్రి కాబోతున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ విలీనమంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి చెప్పినటుంటి స్టోరీలు తాను కూడా చాలా చెప్పగలనన్నారు.
"రేవంత్ రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మనోడు అమెరికా అధ్యక్షుడు అవుతాడని.. మొన్ననే కేజీఎఫ్‌లో ఏదో మీటింగ్ పెట్టి ఆయనెవరో చెప్పారు కదా... ఈయనే అవుతాడేమో మరి. ట్రంప్ సరిపోవడం లేదని.. రేవంత్‌ను పిలుస్తున్నారేమో" అని వ్యంగ్యంగా అన్నారు.