వరుస సెలవులు... తెలుగు రాష్ట్రాల ముఖ్య నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్
- నేటి నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు
- కాచిగూడ - తిరుపతి, కాకినాడ - సికింద్రాబాద్ మధ్య రైళ్లు
- నర్సాపూర్ - సికింద్రాబాద్, కాకినాడ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేడు వరలక్ష్మీ వ్రతం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం నాడు రక్షాబంధన్ కాగా.... ఈ నేపథ్యంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది.
నర్సాపూర్ - సికింద్రాబాద్, కాకినాడ - సికింద్రాబాద్, కాచిగూడ - తిరుపతి మధ్య మొత్తం ఎనిమిది రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
కాచిగూడ - తిరుపతి రైలు ఆగస్ట్ 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి... 17వ తేదీ ఉదయం 10.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుపతి - కాచిగూడ రైలు ఆగస్ట్ 17న తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి... 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
కాకినాడ - సికింద్రాబాద్ రైలు ఆగస్ట్ 18న సాయంత్రం 6.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి... 19న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ - కాకినాడ రైలు ఆగస్ట్ 19న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 20వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
నర్సాపూర్ - సికింద్రాబాద్ రైలు ఆగస్ట్ 18న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి, 19న ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ రైలు ఆగస్ట్ 17, 19 తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడలో బయలుదేరి 18న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరనున్న ఈ రైలు 19, 21 తేదీల్లో ఉదయం 6.30 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.