అసలు ఈ ర్యాంకింగ్స్ ఎలా ఇస్తున్నారో... 8 నెలలుగా బరిలో దిగని బాబర్ ఇంకా టాప్‌లోనేనా: బసిత్ అలీ
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌పై పాక్ మాజీ ఆటగాడు బసిత్ అలీ విస్మయం
- బాబర్ మ్యాచ్ లు ఆడకపోయినా ఐసీసీ ర్యాంక్ కేటాయిస్తున్నట్లు ఉందని ఎద్దేవా
- ఈ ర్యాంకింగ్ సిస్టమ్ తనకు అర్థం కావట్లేదన్న బసిత్
ఐసీసీ ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, దాదాపు 8 నెలల నుంచి ఈ ఫార్మాట్ లో బరిలో దిగని బాబర్ ఇంకా టాప్ లోనే ఉండడంపై అదే దేశానికి చెందిన మాజీ ఆటగాడు బసిత్ అలీ విస్మయం వ్యక్తం చేశాడు.
అతడు మ్యాచ్ లు ఆడకపోయినా ఐసీసీ ర్యాంక్ కేటాయిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశాడు. ఈ ర్యాంకింగ్ సిస్టమ్ తనకు అర్థం కావట్లేదని బసిత్ అలీ తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
వన్డే ర్యాంకింగ్స్‌పై బసిత్ అలీ ఏమన్నాడంటే...
"ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ చూశా. బాబర్ అజామ్ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇక ఇతర స్థానాలను చూడాల్సిన అవసరం లేదనుకోండి. ఈ ర్యాంకులను చూస్తుంటే బాబర్ అజామ్ ఆడకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఐసీసీ వ్యవహరిస్తోంది. వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా ఉన్నందుకు బాబర్ తప్పకుండా ఆనందపడతాడు.
అసలు ఇలాంటి ర్యాంకులను ఇచ్చిందెవరు? దేని ప్రకారం బాబర్ , గిల్ ఈ స్థానాల్లో ఉన్నారు. గతేడాది వన్డే వరల్డ్కప్ లో ఆడిన మ్యాచే బాబర్కు ఆఖరిది. ఆ తర్వాత అతడు ఒక్కసారి కూడా బరిలోకి దిగలేదు. అయినప్పటికీ అతడి ర్యాంకు మాత్రం అలానే ఉంది. ఇక భారత యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ శ్రీలంకపైనే ఆడాడు. అందులో గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. అయినా వీరిద్దరికి టాప్ ర్యాంకులు ఉన్నాయి.
మరోవైపు గత వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర, క్వింటన్ డికాక్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లను చూశాం. వారు టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడి మూడు-నాలుగు సెంచరీలు సాధించారు. ఇక పాక్ నుంచి కేవలం రిజ్వాన్, ఫఖార్ జమాన్ మాత్రమే శతకాలు చేశారు. అలాంటప్పుడు ర్యాంకుల విధానం సరిగ్గా లేదని అనిపిస్తోంది" అని బసిత్ చెప్పుకొచ్చాడు.
కాగా, తాజాగా విడుదలైన వన్డే ఈ ర్యాంకింగ్స్‌లో బాబర్ 824 రేటింగ్స్ తో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ (765 రేటింగ్స్), గిల్ (763 రేటింగ్స్), విరాట్ (746 రేటింగ్స్) వరుసగా 2,3,4 స్థానాలు దక్కించుకున్నారు.
ఇదిలాఉంటే.. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో చెలరేగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ర్యాంకును పెంచుకున్నాడు. హిట్‌మ్యాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ సిరీస్‌లో మిగతా టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. కానీ, రోహిత్ మాత్రం 52.33 సగటు, 141.44 స్ట్రైక్ రేట్‌తో 157 పరుగులతో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.