దినేశ్ కార్తీక్ ఆల్‌టైమ్ భారత జట్టు ప్రకటన.. ధోనీ, గంగూలీకి చోటు ఇవ్వని డీకే!
- అన్ని ఫార్మాట్లలో కలిపి డీకే 11మంది ఆటగాళ్లతో జట్టు ప్రకటన
- కెప్టెన్, వికెట్ కీపర్ ఎవరన్నది మాత్రం ప్రస్తావించని డీకే
- 12వ ఆటగాడిగా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌కు చోటు
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ తన ఆల్‌టైమ్ భారత జట్టును ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి డీకే 11మంది ఆటగాళ్లతో తన జట్టును వెల్లడించాడు. అయితే, అతను ప్రకటించిన జట్టులో మాజీ కెప్టెన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. అలాగే 12వ ఆటగాడిగా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ను తీసుకున్నాడు. కానీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎవరన్నది మాత్రం ప్రస్తావించలేదు.
ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలను తీసుకున్నాడు. వీరిద్దరూ తమదైన దూకుడు బ్యాటింగ్‌కు ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. సెహ్వాగ్ వైట్ బాల్ ఫార్మాట్‌లలో 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. అయితే, వీరూ టెస్ట్‌లలో మాత్రం కేవలం 82.23 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.
మరోవైపు రోహిత్ కూడా వైట్ బాల్ క్రికెట్‌లో తన ఉనికిని చాటాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో 156.70 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు చేశాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత 3, 4, 5 స్థానాలకు వరుసగా రాహుల్ ద్రవిడ్, సచిన్ తెండూల్కర్, విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. రన్‌మెషిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 80 సెంచరీలు బాదాడు.
అలాగే యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాకు ఆల్‌రౌండర్లుగా జట్టులో స్థానం కల్పించాడు. స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లేను ఎంచుకోగా, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌లను తీసుకున్నాడు. హర్భజన్ సింగ్ 12వ ఆటగాడిగా ఎంపిక చేశాడు. ఇక లెజెండరీ ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీలకు తన ఆల్‌టైమ్ జట్టులో చోటు ఇవ్వలేదు.
దినేశ్ కార్తీక్ ఆల్‌టైమ్ ఎలెవన్: వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్; 12వ ప్లేయర్: హర్భజన్ సింగ్.